ఆదిత్య రాసిన కవిత

వనం వానరం

A Forest. A Monkey. A Friendship Forever.

🍃
🎓 కాలేజీ రోజులు
కాలేజీ లో చేరినపుడు ఎవరు, ఎలా వుంటారో మనతో కలుస్తరా - మేము వాల్లతో కలవగలమా, కొన్ని భయాల మధ్యలోని చిన్న ధైర్యం వల్ల స్నేహితులు అనే వాళ్ళు దొరుకుతారు ,
🌿 స్నేహం యొక్క మహత్మ్యం
ఆ స్నేహంలో ఉన్నా మర్మం వలనో , మహత్మ్యం వలనో , మాయ వలనో ఎన్నో తుంటరి పనులు, అల్లరి చేష్టలు ఇలా ఉంటాయి —
🐒 వనం వానరం కథ
" వనం లోని వానరం, వానలో వనమంతా వెతుకుతూ కనిపించని ఆనందం కోసం చేసే పని చేయలేక , వనం - వానరం స్నేహితులు గా మారాయి. మారిన క్షణం నుండి ఎన్నో అనుభవాలు , ఎన్నెన్నో జ్ఞాపకాలను సొంతం చేసుకున్నాయి.
🍂 వీడ్కోలు
చివరికి వనాన్ని వీడి వెళ్లాల్సిన సమయం వచ్చిన వానరం కి ఆ కొన్ని జ్ఞాపకాలనే గుర్తు చేసుకుంటూ తప్పని పరిస్థితి వలన, జీవితం లోని మరో ఘట్టం లోకి వెళ్లిపోవాలి అని తెలిసిన ఆ వానరం , చాల బాధతో ఆ వనాని కి వీడ్కోలు చెప్పింది
🌄 ముందుకు...
ఘట్టం వేరు కాబట్టి స్నేహితుడు అయిన వనాన్ని వానరం వీడక తప్పలేదు . అలాగే , ఈ జ్ఞాపకాలు అన్నీ చిన్నవే అయినా గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళక తప్పదు . అలా చేరాల్సిన గమ్యం కోసం స్నేహితుల్ని కూడా వీడక తప్పదు .
— ఆదిత్య.